
ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఫాలోవర్లతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసుకునే అవకాశం కలగనుంది. ‘చాట్స్టిక్కర్’ అనే పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా అనేక స్టోరీస్‌ను ప్రవేశపెడుతోంది. గ్రూప్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోల్స్, క్వశ్చన్ బాక్సెస్, మెన్షన్స్, లొకేషన్స్, హ్యాష్‌ట్యాగ్స్, కౌంట్‌డౌన్స్ వంటి స్టోరీలను నిర్వహించుకోవచ్చు. అంటే గ్రూపు ఏర్పాటు చేసుకుని పోల్స్ నిర్వహించడం, ఒపీనియన్స్ కలెక్ట్ చేయడం వంటివి చేయొచ్చు. అయితే గ్రూపులో చేరాలంటే ముందుగా స్టిక్కర్ ద్వారా రిక్వెస్ట్ పంపించాలి.