CBSE బోర్డు : అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టండి..!

CBSE బోర్డు : అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టండి..!

సీబీఎస్ఈ బోర్డ్  ఎగ్జామ్స్  నిర్వహణలో  భాగంగా  దేశ వ్యాప్తంగా  సీబీఎస్ఈ  స్కూళ్లలో సీసీటీవీలు అమర్చాలని ఆదేశాలు జారీ చేసింది  బోర్డు.   దేశ వ్యాప్తంగా.. విదేశాల్లో దాదాపు 8 వేల సెంటర్లలో  44 లక్షల మంది విద్యార్థులకు క్లాస్ 10.. క్లాస్12  బోర్డు  ఎగ్జామ్స్  నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

 ఈ క్రమంలో  అన్ని  ఎగ్జామ్స్ సెంటర్స్ లో సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్కూళ్లకు లేఖ రాసింది సీబీఎస్ఈ బోర్డ్. సీసీటీవీ పర్యవేక్షణ లేని పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించబోమని సీబీఎస్ఈ ఎగ్జామ్స్ నిర్వహణ అధికారి భరద్వాజ్ తెలిపారు.

Also Read :- హరికేన్ విధ్వంసం.. 44 మంది మృతి

CCTV కెమెరాలు తప్పనిసరిగా పరీక్షా హాళ్లలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయాలి. ఎగ్జామ్ సెంటర్స్ ఎంట్రెన్స్, ఎగ్జిట్  డెస్క్‌లు,  ఎగ్జామ్స్ కు అటెండయ్యే విద్యార్థులందరూ  తప్పనిసరిగా కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి.  కెమెరాలు తప్పనిసరిగా  హై రిజల్యూషన్‌తో ఉండాలి.  ఎగ్జామ్స్  నిర్వహణను  రికార్డ్ చేయాలి. అలాగే  ఫుటేజీని  సేఫ్ ప్లేసులో భద్రపరచాలి. అవసరమైతే  మళ్లీ డేటాను రివ్యూ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రతి 10 గదులను పర్యవేక్షించేందుకు ఒక్క ఇన్విజిలెటర్ ఉంటారని బోర్డు తెలిపింది.