
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శంకరపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హర్యానా గవర్నర్బండారు దత్తాత్రేయ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్యెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్యెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య రజాకారుల దురాగతాలు, దుర్మార్గాలపై వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేశారన్నారు. కురుమలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే విద్యతోనే సాధ్యమని చెప్పారు. కురుమల కోసం ప్రతి జిల్లాలో కరుమ సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కురుమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.