వైభవంగా రాజరాజేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

వైభవంగా రాజరాజేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

నేరడిగొండ, వెలుగు : నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం వైభవంగా సాగింది. విగ్రహాలకు ముందుగా పంచామృతాలతో అభిషేకం, రుద్ర హోమాన్ని వేద పండితులు శ్రవణ్ కుమార్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ..

చెడు వ్యసనాలు వదిలి ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఆధ్యాత్మికత వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నేతలు ఏలేటి సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరమణ, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.