హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (జనవరి 26) ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీసీఎం చంద్రబాబు నాయుడుపై హాట్ కామెంట్స్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే.. మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నారని.. కూటమి పాలనపై వైసీపీ కార్యకర్తలు ఎదురు తిరగాలి అన్నారు. అవసరమైతే అవతలి వాళ్లను చంపడానికైనా సిద్ధంగా ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పాలన మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా ఉండేది..ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం మూడు అత్యాచారాలు, ఆరు హత్యలుగా అన్నట్టుగా పరిపాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్ ఇస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
అమాయకుడైన కురుబ వీరన్న అనే వ్యక్తిని దారుణంగా చంపారు.ఆరుగురు పిల్లలు ఉన్నటువంటి ఈయనని చంపి కడుపుకోత మిగిల్చారు అంటూ కూటమి నేతలు, కూటమిపాలనపై తీవ్రస్థాయి లో విమర్శలు కురిపించారు. దయచేసి ఇలాంటి హత్యలను ఆపివేయాలని లేకపోతే యువతల వాళ్లు కూడా ఆత్మ రక్షణ కోసం చేతిలో ఏ ఆయుధం ఉంటే దానితో అవతలి వారిని చంపి మనల్ని మనం రక్షించుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు గోరంట్ల మాధవ్.