పాల్వంచ,వెలుగు: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) 6వ దశలో ఇన్సులేషన్ కేబుల్ శనివారం దహనమైంది. కర్మాగారంలోని 11వ యూనిట్ లో అధికారులు 20 రోజులపాటు వార్షిక రిపేర్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున యూనిట్ ను సింక్రనైజేషన్ చేశారు. ఈ క్రమంలో టర్బైన్ మూడో నంబర్ బేరింగ్ వద్ద ఫ్యూయల్ లీక్ కావడంతో అధికంగా వచ్చిన టెంపరేచర్ మూలంగా ఇన్సులేషన్ కేబుల్ పై ఒత్తిడి పెరిగి మంటలు లేచాయి.
వెంటనే సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని, యూనిట్ నుంచి విద్యుత్ ఉత్ప త్తిని పునరుద్ధరిస్తామని చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు తెలిపారు.