- ఫేక్ సర్టిఫికెట్లతో సొమ్ము కాజేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- ఆర్టీఐకి అప్లై చేసిన బాధితుడు
కాగజ్ నగర్, వెలుగు : ఓ తాపీ మేస్త్రీ బతికుండగానే అతడి పేరు మీద గుర్తుతెలియని వ్యక్తులు డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజన్న తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. 2018 మార్చిలో లేబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇటీవల రెన్యువల్ కోసం లేబర్ ఆఫీస్కు వెళ్లగా అతడి పేరుపై మరణ ధ్రువపత్రాలు సమర్పించి లేబర్ ఇన్సూరెన్స్ ను తీసుకున్నట్లు అక్కడి ఆఫీసర్లు చూపించారు.
తాను బతికే ఉన్నానని, తన పేరు మీద డెత్ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకుంటారని ప్రశ్నించాడు. అయితే అక్కడి ఆఫీసర్లు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో తన డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం)కి అప్లై చేశాడు. తాను బతికుండగానే చంపేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను కోరాడు.