మిడిల్ క్లాస్కు షాక్.. ఇన్సురెన్స్ ప్రీమియం10 శాతానికిపైగా పెంచే చాన్స్

మిడిల్ క్లాస్కు షాక్.. ఇన్సురెన్స్ ప్రీమియం10 శాతానికిపైగా పెంచే చాన్స్

కొత్త ఏడాది 2025లో ఇన్సురెన్స్ కంపెనీలు ఎడా పెడా వాయించేందుకు సిద్ధమయ్యాయి. ప్రీమియం రేట్లను భారీగా పెంచి మధ్య తరగతి నుంచి భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ లో ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ప్రీమియంను ఏడాదికి కనీసం 10 శాతానికిపైగా పెంచే యోచనలో ఇన్సురెన్స్ కంపెనీలు ఉన్నాయి. బడ్జెట్ కు ముందే కంపెనీలు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రీమియం రేట్లను పెంచి అమలు చేయనున్నట్లున్నాయి కంపెనీలు. 

అయితే పెంచాల్సిన ధరలపై పై ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (IRDAI) నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. అందుకోసం ప్రతిపాదనలను  IRDAI ముందు ఉంచాయి కంపెనీలు. అందుకు రెగ్యులేటరీ అంగీకరిస్తే 10  శాతానికి పైగా పెంచాలనే ప్లాన్ లో ఉన్నాయి. 

ALSO READ : బడ్జెట్లో పెట్రోల్, డీజిటల్ ధరలు తగ్గనున్నాయా : సీఐఐ డిమాండ్ ఏం చెబుతోంది..!

ఇన్సురెన్స్ ధరల మానిటరింగ్ సందర్భంగా IRDAI కీలక వ్యాఖ్యలు చేసింది. హెల్త్ ఇన్సురెన్స్ కు సంబంధించి ధరలు పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయని, ముఖ్యంగా 60 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి ప్రీమియం భారీగా పెంచే ఛాన్స్ ఉందని, అయితే దీనిపై కనీసం 10 శాతానికి మించకుండా క్యాప్ విధించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. 

అదే విధంగా మున్ముందు పెంచిన ధరలతో పాటు రెగ్యులేటరీ చేసిన మార్పులు, నిబంధనల్లో తెచ్చిన వెసులుబాటును కూడా ప్రచారంలోకి తీసుకెళ్లాలని సూచించింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో భాగంగా వివిధ ఆస్పత్రులలో కామన్ ప్యాకేజీ రేట్లు అమలు చేసేలా చర్చలు జరపాలని ఆదేశించింది.