
గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న ఐటీఐ విద్యార్థులకు రైల్వే రిక్రూర్‍మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 1,010 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2024 మే 22 నుంచి దరఖాస్తులు ప్రారంభమైయ్యాయి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు నాన్-ఐటీఐ అభ్యర్థులు కూడా అర్హులే. ఐటీఐ అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 21 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. నాన్-ఐటీఐ అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.100, లేడీస్, హ్యాడీక్యాపిడ్, ఎస్టీ, ఎస్సీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్pb.icf.gov.in లో అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసి.. ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అకడమిక్ఈయర్ మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ జూన్ 21. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్ ట్రేడుల్లో పోస్టులు ఉన్నాయి.