
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2023–-24 విద్యా సంవత్సరానికి స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదలైంది.
విభాగాలు: మెషిన్ లెర్నింగ్, సెన్సర్స్ అండ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. టీఎస్ ఎంసెట్ 2023 లేదా జేఈఈ(మెయిన్) 2023 ర్యాంకు సాధించి ఉండాలి. అభ్యర్థులు 16 ఏళ్లు నిండి ఉండాలి.
సెలెక్షన్: టీఎస్ ఎంసెట్ 2023 లేదా జేఈఈ(మెయిన్) 2023 ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు సీటు కేటాయిస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జులై 17న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వివరాలకు www.doa.jntuh.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.