కరీంనగర్ జిల్లాలో రూ.16.5కోట్లతో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్ నిర్మాణం

కరీంనగర్ జిల్లాలో రూ.16.5కోట్లతో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్ నిర్మాణం

కరీంనగర్ టౌన్,వెలుగు : పద్మనగర్ లో రూ.16.5కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. సోమవారం పద్మానగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేయర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 193 మంది చిరువ్యాపారాలు చేసుకునేలా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అత్యాధునికంగా నిర్మిస్తున్నామన్నారు. 

విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం కళాభారతిలో కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణితో కలిసి లక్కీడ్రా ద్వారా చిరువ్యాపారులకు షెట్టర్లు కేటాయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, తాడెపు శ్రీదేవి, బోనాల శ్రీకాంత్, లీడర్లు చంద్రమౌళి, ఇంజనీరింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.