సికింద్రాబాద్, వెలుగు: దేశ శ్రేయస్సు కోసం సంపూర్ణ సత్య నిష్ట, నిజాయతీ పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. విజిలెన్స్అవగాహన వారోత్సవాల్లో భాగంగా శనివారం నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి ఇంటిగ్రిటీ వాకథాన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, సహోద్యోగులు, పొరుగువారిలో ఆ సంస్కృతిని ప్రోత్సహించాలని సూచించారు. రైల్వే అధికారులు,సిబ్బంది, స్టూడెంట్లు పాల్గొన్నారు. క్యారికేచర్ పెయింటింగ్ విజేతలకు జీఎం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.