Intel: ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా..ఉద్యోగులకు ఉచిత కాఫీ, టీలు..ఎందుకో తెలుసా

Intel: ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా..ఉద్యోగులకు ఉచిత కాఫీ, టీలు..ఎందుకో తెలుసా

Intel: ఇంటెల్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.తన వర్క్ ఫోర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు కొత్తగా సౌకర్యాలను కల్పిస్తోంది. ఇంటెల్ ఆఫీస్ వర్క్ ను ప్రోత్సహించే క్రమంలో ఉద్యోగులకు తిరిగి కార్యాలయాల్లో ఉచితంగా కాఫీ, టీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ గుడ్ న్యూస్ ను ఉద్యోగులకు మేసేజ్ షేర్ చేసింది. 

ఇంటెల్ తన ఉద్యోగులకు పంపించిన మేసేజ్ లో డైలీ లైఫ్ కావాల్సిన సౌకర్యాల ప్రాముఖ్యతను తెలిపింది. ఇంటెల్ ఇప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొం టున్నప్పటికీ చిన్నిచిన్న సౌకర్యాలు రోజువారీ పనుల్లో కీలకం అని  గుర్తించినట్లు ఉద్యోగులకు పంపిన మేసేజ్ లో చెప్పింది. అంతేకాదు మేం తీసుకున్న ఈ నిర్ణ యం ఆఫీస్ ఎన్విరాన్ మెంట్ ను బాగా ప్రోత్సహిస్తుందని తెలిపింది.  

ALSO READ : విప్రోలో 1.6 శాతం వాటా కొన్న అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీ పీఈ

అయితే మరోవైపు ఇంటెల్ కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు వర్క్ ఫోర్స్ ను తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు గా తెలుస్తోంది. దాదాపు 15 వేల మందిని తొలగించే ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2వేల మంది సిబ్బందిని తొలగించింది.