ఇంటెల్.. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ.. కంప్యూటర్ల తయారీ సంస్థ.. మొన్నటి వరకు అక్కడ పని చేసిన ఉద్యోగులు దర్జాగా ఉన్నారు.. ఫ్రీ కాఫీ, టీ.. భోజనం.. పికప్, డ్రాపింగ్ ఇలా.. అబ్బబ్బ లగ్జరీ జీవితం అనుభవించారు.. అది కూడా ఆఫీసులో.. ఇప్పుడు కంపెనీకి ఏమైందో ఏమో.. సడెన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నది. వీకెండ్ తర్వాత.. 2024, అక్టోబర్ 28వ తేదీ ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు షాక్.. క్యాంటీన్ లో కాఫీ, టీ కనిపించలేదు.. ఎప్పుడూ నిండుగా.. ఫుల్ గా ఉండే క్యాంటీన్ వెలవెలబోయింది.. ఇదేమని ప్రశ్నిస్తే.. ఫ్రీ కాఫీ, టీ బంద్ అయ్యాయి అని కంపెనీ చెప్పింది.
అత్యంత తక్కువ ఖర్చు అయ్యే టీ, కాఫీ విషయంలోనే కంపెనీ పొదుపు మంత్రం పాటించింది అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అయ్యింది అంటున్నారు ఉద్యోగులు. ఇప్పటికే 15 వేల మందిని తొలగించిన ఇంటెల్.. ఇప్పుడు కాఫీ, టీ తొలగింపుతో రాబోయే రోజుల్లో ఇంకెన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో అనే భయంతో ఉన్నారు. ఇది జరిగింది ఇజ్రాయెల్ లోని ఇంటెల్ కార్పొరేట్ ఆఫీసులో.. అంతే కాకుండా ఇంటెల్ మరోసారి లేఆఫ్స్ చేపట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం.
లేఆఫ్స్ లో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ప్యాకేజ్ తో పాటు.. కౌన్సిలింగ్, కెరీర్ సర్వీసెస్ వంటి అసిస్టెన్స్ కల్పించాలని డిసైడ్ అయ్యింది ఇంటెల్. లేఆఫ్స్ తో పాటు పెద్ద ఎత్తున కాస్ట్ కట్టింగ్ చేసేందుకు ఇంటెల్ సిద్ధమైందని.. ఇందులో భాగంగానే.. ఫ్రీ కాఫీ, టీ సదుపాయాన్ని బంద్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటెల్ నిర్ణయంపై ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే సొమ్ము కొంత తగ్గించి తమకు ఫ్రీ కాఫీ, టీ, జ్యూస్ లు లాంటి కనీస సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నిస్తున్నారు.
ALSO READ : పెస్టివ్ సీజన్‌లో 20 శాతం పెరిగిన ఉద్యోగాలు : అప్నాడాట్‌కామ్
ఇంటెల్ నిర్ణయం సరైనది కాదని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఈ నిర్ణయం వల్ల చాలా మంది బెస్ట్ ఎంప్లాయిస్ సంస్థను వీడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏదేమైనా.. ఇంటెల్ లాంటి బడా సంస్థ కూడా కాస్ట్ కట్టింగ్ చేపట్టిందంటే.. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఎంత దిగజారిందో అంచనా వేయచ్చు. అసలే లేఆఫ్స్ టెన్షన్ తో సతమతమవుతున్న ఉద్యోగులపై ఫ్రీ కాఫీ, టీ లాంటి సదుపాయాల్ని కూడా బంద్ చేయటం తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మరి, ఈ విషయంలో ఇంటెల్ పునరాలోచన చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.