
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీల నిర్వహణ, కొత్త టెక్నాలజీలవైపు పయనం, మరో రంగంలోకి బిజినెస్ స్ప్రెడింగ్ వంటి కారణాలతో టెక్ కంపెనీలు వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ చిప్స్, కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ తయారీ సంస్థ ఇంటెల్ గ్రూప్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. తన వర్క్ ఫోర్స్ లో దాదాపు 20 శాతం తగ్గించుకునేందుకు సిద్ధమవుతోంది.
కంపెనీ నిర్వహణ, బ్యూరోక్రసీ తొలగింపు, ఇబ్బందుల్లో ఉన్న చిప్ మేకర్ ఇంజనీరింగ్ పునిర్నిర్మాణం వంటి లక్ష్యాలతో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీ సీఈవో లిబుటాన్ చెప్పారు. ఇంటెల్ తన బిజినెస్ లో తగ్గుతున్న ఆదాయం, చిప్ తయారీలో AMD, NVidia వంటి ప్రత్యర్థి కంపెనీలనుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటుంది. 2024 చివరినాటికి ఇంటెల్ లక్షా 8వేల 900 మంది ఉద్యోగులను తొలగించింది. గతేడాది 15వేల ఉద్యోగాల కోత పెట్టిన ఇంటెల్ తాజా లేఆఫ్స్ ప్రకటించింది. అయితే 2023లో లక్షా 24వేల 800 ఉద్యోగుల తొలగింపు కంటే ఇది తక్కువే.
చిప్ మార్కెట్లో కీలక మార్పులు, వేగంగా అభివృద్ది చెందుతున్న AI రంగాన్ని అడాప్ట్ చేసుకోవడంలో ఆలస్యం ఇంటెల్ ను ప్రధానంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య. ఇంటెల్ AI, లేటెస్ట్ చిప్ తయారీలో ప్రపంచంలో అత్యంత విలువైన సెమీకండక్టర్ కంపెనీగా పేరొందిన Nvidiaను బీట్ చేయలేకపోతోంది. దీంతో చిప్ తయారీలో లాభదాయకమైన అవకాశాలు కోల్పోయి వెనకబడి ఉంది.
ఇంటెల్ కీలకమైన విస్తరణ ప్రాజెక్టులను నిలిపివేసింది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ ఉత్పత్తి సంస్థ అయిన ఇంటెల్ తన మొదటి త్రైమాసిక ఫలితాలలో కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా లేఆఫ్స్ ప్రకటించింది.