శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు హై అలర్ట్.. వాళ్లకు జనవరి 30 వరకు నో ఎంట్రీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు హై అలర్ట్.. వాళ్లకు జనవరి 30 వరకు నో ఎంట్రీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు హై అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ ప్రకటించాయి. దీంతో ఎయిర్ పోర్ట్లో నిఘా పెంచారు సెక్యూరిటీ అధికారులు. ఎయిర్ పోర్ట్ లో వచ్చే ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనికి చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు.  

ఎయిర్ పోర్ట్ కు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు అధికారులు.  అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  జనవరి 30 వరకు ఎయిర్ పోర్ట్ కు సందర్శకులు ఎవరు రావద్దని అదేశాలు జారీ చేశారు అధికారులు.

ALSO READ | రాజేందర్నగర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్లో మంటలు.. తగలబడి పోయిన బైక్లు