
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టైర్-1 పరీక్ష, నైపుణ్య పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌లో జూన్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిగ్రీ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సెలెక్షన్: టైర్-1 పరీక్ష, నైపుణ్య పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. వయసు 18 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్ 3 నుంచి జూన్ 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.450 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.mha.gov.in లేదా www.ncs.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.