మునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంతోపాటు... మునుగోడు నియోజకవర్గంలోకి ప్రవేశించే అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ఇవాళ్టి నుంచి మునుగోడులోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలను కూడా తనిఖీలు చేస్తున్నారు. 

డబ్బుకు సంబంధించిన ఆధారాలు లేవంటూ సీజ్

మునుగోడు మండలం గూడపూరు వద్ద కార్లో తరలిస్తున్న 13 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. చండూరు మండలము బీమనపల్లి కీ చెందిన నరసింహ అనే వ్యక్తి టీఎస్07 జీవై 7383 అనే నెంబరు గల కారులో రూ.13 లక్షల నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును, పండగకు సొంత ఇంటికి వస్తూ తీసుకువచ్చానని... మళ్లీ ఆ డబ్బును హైదరాబాద్ కు తీసుకువెళుతున్ననని బాధితులు చెబుతున్నారు. సరైన ఆధారాలు లేవంటూ పోలీసులు సీజ్ చేశారు.