నువ్వా-నేనా!: అంబానీ-అదానీల మధ్య ముదురుతున్న పోటీ

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఆసియాలోని అత్యంత ధనవంతుల లిస్టులో మొదటి రెండు ప్లేస్‌‌‌‌లలో ఉన్న  ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య అసలైన పోటీ నెలకొనబోతోంది. ఇప్పటి వరకు పెట్రోకెమికల్స్ బిజినెస్‌‌‌‌లో టాప్‌‌‌‌లో ఉన్న ముకేశ్ అంబానీకి పోటీగా గౌతమ్ అదానీ దిగారు . గ్రీన్ ఎనర్జీలో టాప్‌‌‌‌లో  గౌతమ్ అదానీకి ముకేశ్ అంబానీ సవాలు విసురుతున్నారు. తాజాగా సౌదీ ఆరామ్‌‌‌‌కోలో వాటా కొనడానికి అదానీ గ్రూప్ కూడా ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి. నిజానికి సౌదీ ఆరామ్‌‌‌‌కోతో దోస్తీ కుదుర్చుకోవాలని గత రెండున్న రేళ్ల నుంచి ముకేశ్ అంబానీ  రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నించింది.  సౌదీ ఆరామ్‌‌‌‌కో దేశంలోని ప్రభుత్వ ఆయిల్ కంపెనీలతో కలిసి అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌‌‌‌ను మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని చూసింది. ల్యాండ్ సమస్యలు, పొలిటికల్ కారణాలతో ఈ డీల్ ముందుకెళ్లలేదు. ఆ తర్వాత రిలయన్స్‌‌‌‌– సౌదీ ఆరామ్‌‌‌‌కో డీల్ పట్టాలెక్కింది. తన కంపెనీలోని  20–25 బిలియన్ డాలర్ల విలువైన వాటాను ఆరామ్‌‌‌‌కోకి  అమ్మి, ఈ వాల్యూకి సమానమైన వాటాను సౌదీ ఆరామ్‌‌‌‌కోలో  దక్కించుకోవాలని ముకేశ్ అంబానీ ప్రయత్నించారు. రిలయన్స్ బోర్డులో ఆరామ్‌‌‌‌కో చైర్మన్‌‌‌‌ను ఇండిపెండెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా నియమించారు కూడా.  గత రెండున్నరేళ్లుగా అనేక చర్చలు, డ్రామాలు తర్వాత కూడా ఈ రెండు కంపెనీల మధ్య పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్ ముందుకు కదలలేదు.  సౌదీ ఆరామ్‌‌‌‌కో  ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్‌‌‌‌ను ఉత్పత్తి చేసే కంపెనీ. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌కు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌‌‌‌ ఉంది. ఈ రెండు కంపెనీల మధ్య పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్ సరిగ్గా సరిపోతుంది. కానీ, రిలయన్స్‌‌‌‌–ఆరామ్‌‌‌‌కో డీల్  ఆగిపోయింది. ఈ టైమ్‌‌‌‌లో పెట్రో కెమికల్స్ బిజినెస్‌‌‌‌లోకి అదానీ ఎంటర్ అయ్యారు. ఇప్పటికే ఫ్రెంచ్ కంపెనీ టోటల్‌‌‌‌తో  గ్యాస్ సప్లయ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లో ఉన్న అదానీ, పెట్రో కెమికల్స్ సెగ్మెంట్‌‌‌‌లో  మరింత విస్తరించాలని ప్లాన్స్ వేస్తున్నారు. టాప్ కంపెనీలయిన  బీఏఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈ, బోరియల్స్‌‌‌‌ ఏజీ, అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్‌‌‌‌ (ఏడీఎన్‌‌‌‌ఓసీ) లతో కలిసి 4 బిలియన్ డాలర్లతో అతిపెద్ద పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్‌‌‌‌ పెడతానని కిందటేడాది గౌతమ్ అదానీ ప్రకటించారు కూడా. పాలిమర్స్, పాలిస్టర్స్‌‌‌‌, ఇంటర్మీడియేటరీ ఫైబర్స్‌‌‌‌ల తయారీలో రిలయన్స్ టాప్‌‌‌‌లో ఉంది. ఇదే బిజినెస్‌‌‌‌లో అంబానీతో అదానీ పోటీ పడనున్నారు. 
 

రిటైల్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లో అదానీ.. 
అంబానీ టెలికం బిజినెస్‌‌‌‌తో ముందుకెళుతుండగా, అదానీ డేటా స్టోరేజ్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌లో విస్తరిస్తున్నారు.  గ్రోసరీ సప్లయ్‌‌‌‌  చెయిన్‌‌‌‌లో ముకేశ్ అంబానీ డైరెక్ట్‌‌‌‌గా అమెజాన్‌‌‌‌తో పోటీపడుతుండగా, అదానీ కూడా వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్‌‌‌‌తో ఈ సెగ్మెంట్‌‌‌‌లోకి ఎంటర్ అయ్యారు. అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ ఫార్చూన్ అదానీ గ్రూప్ సొంతం. మిగిలిన రిటైల్ బిజినెస్‌‌‌‌లలో కూడా అదానీ గ్రూప్ ఎంటర్ అవ్వాలని చూస్తోంది. రిలయన్స్‌‌‌‌తో పోలిస్తే  గౌతమ్ అదానీ కంపెనీలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇరువురి మధ్య పోటీ ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో  కాని తెలియదు. కానీ, పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
 

గ్రీన్ ఎనర్జీలోనే అసలైన పోటీ..
చాలా ఏళ్ల నుంచి అదానీ, అంబానీకి మధ్య డైరెక్ట్‌‌‌‌గా  పోటీ లేదు. ఒకరు  ఆయిల్, టెలికం, రిటైల్ బిజినెస్‌‌‌‌లో దూసుకుపోతే, మరొకరు దేశంలోని  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులు, పోర్టులు, పవర్‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ ‌‌‌‌ బిజినెస్‌‌‌‌లలో ఎదిగారు. ఇద్దరూ గుజరాత్‌‌‌‌కు చెందినవాళ్లే.  ఇద్దరికి కూడా  పొలిటికల్‌‌‌‌గా ఇన్‌‌‌‌ఫ్లూయెన్స్ ఉంది. గత ఐదేళ్లలో వీరి సంపద రాకెట్‌‌‌‌లా దూసుకుపోయింది. గౌతమ్ అదానీ ఎక్కువ ఫోకస్ పెట్టింది గ్రీన్ ఎనర్జీ పైనే. అదానీ గ్రీన్‌‌‌‌ ఎనర్జీతో  203‌‌‌‌‌‌‌‌0 నాటికి అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా మారాలని ఆయన టార్గెట్‌‌‌‌ పెట్టుకున్నారు. ఇదే టైమ్‌‌‌‌లో  ముకేశ్ అంబానీ కూడా గ్రీన్ ఎనర్జీ బిజినెస్‌‌‌‌పై ఫోకస్ పెట్టారు.  చిన్న కంపెనీలను కొనడం స్టార్ట్ చేశారు.  గుజరాత్‌‌‌‌లోని జామ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో అతిపెద్ద  గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏకంగా 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు.  సోలార్ ప్యానెల్స్‌‌‌‌ కోసం, బ్యాటరీల కోసం, గ్రీన్‌‌‌‌ హైడ్రోజన్‌‌‌‌, ఫ్యూయల్ సెల్స్ కోసం గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గౌతమ్ అదానీ కూడా గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్‌‌‌‌లో మరింత విస్తరించేందుకు భారీగా ఇన్వెస్ట్ చేయడానికి కూడా వెనకాడమని ప్రకటించారు. దీంతో ఇరువురి మధ్య డైరెక్ట్ పోటీ నెలకొంది.