మేళ్లచెరువు, వెలుగు : ఈ నెల 3 నుంచి మేళ్లచెరువు లోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని శనివారం ప్రిన్సిపాల్ మురళి తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ కి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ
బైపీసీలో చేరే గిరిజన బాలుర స్టూడెంట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అడ్మిషన్ కోసం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు జీరాక్స్ సెట్లు, నాలుగు పాస్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. వివరాలకు 94908 14096 ను సంప్రదించాలన్నారు.