ఇంటర్ ప్రశ్న పత్రాలు గల్లంతు

ఇంటర్మీడియట్‌ బోర్డు తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఇప్పటికే ఫలితాల్లో అవకతవకలతో అబాసుపాలైన బోర్డు.. తాజాగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలను భద్రపరచడంలోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.

తాజాగా వరంగల్  పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన ఇంటర్నీడియట్ అడ్వాన్స్‌డ్‌ ప్రశ్న పత్రాలు గల్లంతయ్యాయి. ప్రశ్నాపత్రాలు ఉంచిన  2 సీల్డు బాక్సులు మాయం కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మాయమైన పత్రాల గురించి విచారణ జరుపుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.