
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ స్పందించింది. మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. వారి విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ పరీక్ష, రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ దరఖాస్తు గడువును పొడిగించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆ గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండగా… మరో రెండు రోజుల పాటు అంటే ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్ష, రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌కు 27వ తేదీ చివరి తేదీ అని తెలిపింది.