హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫీజు గడువును మరోసారి ఇంటర్ బోర్డు అధికారులు పొడిగించారు. రూ.2500 ఫైన్‌తో ఈ నెల 16 వరకు చెల్లించేందుకు చాన్స్ ఇచ్చినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ అవకాశాన్ని స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాగా, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.