కమిటీ నివేదికపై నాకెలాంటి సమాచారం లేదు: అశోక్

కమిటీ నివేదికపై నాకెలాంటి సమాచారం లేదు: అశోక్

త్రిసభ్య కమిటీ నివేదికపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ చెప్పారు. శనివారం సెక్రటేరియట్ దగ్గర మీడియాతో మాట్లాడిన ఆయన  ఇంటర్ ఫలితాల్లో లోపాలను సరిచేసేందుకు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ చేస్తున్నామన్నారు. ధరణి ప్రాజెక్టుకు ఉపయోగిస్తున్న స్కానర్లను ఈ ప్రక్రియకు వినియోగిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ ఫలితాల కు ముందే రీ వెరిఫికేషన్ అకౌంటింగ్ రిజల్ట్ వస్తుందని తెలిపారు.13 కేంద్రాల్లో ఇంటర్‌ మార్కుల రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ చేస్తున్నామని వివరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించామన్నారు. వీలైనంత తొందరగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ పూర్తి చేస్తామని అశోక్ కుమార్ అన్నారు