- ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, వెలుగు : సిలబస్‌ను సకాలంలో పూర్తిచేసి పరీక్షలకు స్టూడెంట్లను సిద్ధం చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య.. అధికారులను ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్ లోని సేవాలాల్ భవన్ లో డీఈవోలు, కాలేజీ ప్రిన్సిపల్స్, ఇంటర్ బోర్డు అధికారులతో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. కాలేజీల గుర్తింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, ల్యాబుల్లో సౌకర్యాలు, కాంపౌండ్ వాల్స్ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసి చర్యలు తీసుకుందామని చెప్పారు. టోల్ ఫ్రీనెంబర్ 14416 కు కాల్ చేస్తే సైకాలజిస్టులు వారికి కౌన్సెలింగ్ ఇస్తారని వెల్లడించారు.