నిర్ణీత సమయంలోపు వాల్యుయేషన్ పూర్తి చేయాలి : ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య 

నిర్ణీత సమయంలోపు వాల్యుయేషన్ పూర్తి చేయాలి : ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పండగ రోజున వాల్యుయేషన్ సిబ్బందికి సెలవు ప్రకటించినట్టు చెప్పారు.

కాచిగూడ సర్కారు కాలేజీలో కొనసాగుతున్న వాల్యుయేషన్ క్యాంపును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడి వసతులు, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూల్యాంకన ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.