ఇంటర్ బాలుడిపై 11 మంది విద్యార్థుల లైంగిక దాడి

తనపై లైంగిక వేధింపులు జరగడంతో అవమానంతో కుంగిపోయిన ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకొని చనిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. 18 ఏళ్ల ఇంటర్ బాలుడిని.. అతడి తోటి విద్యార్థులు మరియు హాస్టల్ సిబ్బంది గత కొన్ని రోజులుగా లైంగికంగా హింసించడంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

చంద్రపూర్ జిల్లా, మరై పటాన్‌లోని సెవాదళ్ బాయ్స్ హాస్టల్‌లో బాధితుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అదే హాస్టల్‌లో ఉంటున్న అతని సహచర విద్యార్థులు మరియు కొంతమంది హాస్టల్ సిబ్బంది ప్రతిరోజూ లైంగికంగా వేధించేవారు. దాంతో వేధింపులు భరించలేక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో పోలీసులు బాధితుడికి సంబంధించిన ఒక నోట్‌బుక్‌ని స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను గతంలో ఎదుర్కొన్న సంఘటనలను కూడా పేర్కొన్నాడు. ఆ నోట్‌బుక్‌ ఆధారంగా అతనిపై లైంగిక దాడి చేసిన 11 మంది విద్యార్థులను మరియు ముగ్గురు హాస్టల్ సిబ్బందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డివిజనల్ పోలీసు అధికారి శిల్వంత్ నందేద్కర్ తెలిపారు.

For More News..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

దేశంలోనే మొదటిసారి ఫేస్ రికగ్నైజేషన్ యాప్

మందు, మనీ లేదంటే బెదిరింపు వార్డు మెంబర్ల కోసం రంగంలోకి దిగిన MLA