డిచ్పల్లి, వెలుగు : తెలంగాణ వర్సిటీలో శుక్రవారం ఇంటర్ కాలేజీ ఖోఖో జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలను రిజిస్ట్రార్యాదగిరి ప్రారంభించారు. వర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలకు చెందిన క్రీడాకారుల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. ఎంపిక అయిన క్రీడాకారులు యూనివర్సిటీ తరఫున సౌత్ జోన్ఇంటర్ వర్సిటీ పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు.
డిసెంబర్ 26 నుండి 30 వరకు కేరళలోని యూనివర్సిటీ ఆఫ్ కాలికట్లో పురుషుల ఖోఖో పోటీలు, తమిళనాడులోని సెంట్రల్యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో మహిళల ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, పీఈడీలు అనిల్ కుమార్ పాల్గొన్నారు.