
తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలకు 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు క్యాలండర్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 2 వ తేదీనుంచి కాలేజీలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్ట్ అధికారులు తెలిపారు. అప్పటి వరకు సమ్మర్ హాలిడేస్ అని.. వేసవి సెలవల్లో తరగతులు నిర్వహిస్తే కాలేజీల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ...
ఇంటర్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ.. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పాటించాలని ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ సారి ఇంటర్ క్లాసులు 226 రోజులు పాటు నిర్వహించనున్నారు. అలాగే 77రోజులు జూనియన్ కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ 2026 ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి. అలాగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మాత్రం... మార్చి నెలలో జరగనున్నాయి.
- 2025.. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు దసరా సెలవులు
- నవంబర్ 10 నుంచి 15 వరకు ఇంటర్ ఆఫ్ ఇయర్ ఎగ్జామ్స్
- 2026 జనవరి 11 నుంచి 18 వరకు కాలేజీలకు సంక్రాంతి సెలవులు
- ఫిబ్రవరి 2026లో ప్రాక్టికల్స్ పరీక్షలు
- మార్చి 2026 లో ఇంటర్ వార్షిక పరీక్షలు
- 2026 ఏప్రిల్ 1 నుండి మే 31 కాలేజీలకు సమ్మర్ హాలిడేస్