ఇవ్వాళ నుంచి ఇంటర్ కాలేజీలు రీఓపెన్

ఇవ్వాళ నుంచి ఇంటర్ కాలేజీలు రీఓపెన్
  •     ఇంకా పూర్తికాని ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్లు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని జూనియర్  కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. దీంతో శనివారం నుంచి కాలేజీలు రీఓపెన్  కానున్నాయి. అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని జూనియర్  కాలేజీలకు మార్చి 31 నుంచి మే 31 వరకూ ఇంటర్  బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది.

శుక్రవారంతో అన్ని కాలేజీలకు సెలవులు పూర్తయ్యాయి. దీంతో శనివారం సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ తో పాటు అన్ని రకాల మేనేజ్మెంట్ల కాలేజీలు రీఓపెనింగ్  కానున్నాయి. ఇప్పటికే ఇంటర్  బోర్డు అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. 

726 కాలేజీలకే గుర్తింపు 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,269 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో శుక్రవారం రాత్రి నాటికి 2,483 కాలేజీలకు ఇంటర్  బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. దీంట్లో 1,443 ప్రైవేటు కాలేజీలు ఉండగా.. వాటిలో 726 కాలేజీలకే అనుమతి ఇచ్చారు. 421 సర్కారు కాలేజీలకూ అధికారికంగా గుర్తింపు ఇచ్చారు. అయితే, శనివారం నుంచి కాలేజీలు పున:ప్రారంభం కానున్నా..

ఇప్పటికీ మిక్స్ డ్  ఆక్యుపెన్సీ భవనాల్లోని ప్రైవేటు కాలేజీలపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా కాలేజీల్లో చదువుతున్న సెకండియర్  స్టూడెంట్ల భవితవ్యంపై అయోమయం నెలకొంది.