జీళ్లచెర్వులో అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు షురూ

కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలంలో జీళ్లచెర్వుకు చెందిన పొంగులేటి యువసేన కమిటీ ఆధ్వర్యంలో అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంపు ఆఫీస్​ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామీణ క్రీడ కబడ్డీకి తొలి ప్రాధాన్యత ఇస్తూ పోటీలకు శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులను అభినందించారు. ఆహ్లాద వాతావరణంలో పోటీలను ముగించాలని కోరారు. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటుందని  దయాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.