
- రూ.28 తులాల గోల్డ్ స్వాధీనం జగిత్యాల ఎస్పీ వెల్లడి
జగిత్యాల టౌన్, వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను జగిత్యాల టౌన్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం మీడియా సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు తెలిపారు. మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన బక్క శెట్టి కొమరయ్య అలియాస్ రేగుల అజయ్ మంచిర్యాల టౌన్ లో ఉంటున్నాడు. చోరీలకు పాల్పడుతుండగా 25 కేసులు ఉండగా.. జైలుకు వెళ్లివచ్చాడు. బుధవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని పట్టుకొని విచారించారు. ఇటీవల జగిత్యాలలో వరుస చోరీలను తనే చేసినట్లుగా బక్క శెట్టి కొమురయ్య ఒప్పుకున్నాడు. ఏడు చోరీల్లో 28 తులాల గోల్డ్ ను నిందితుడిని నుంచి స్వాధీనం చేసుకోగా.. దాని విలువ 25 లక్షలు ఉంటుంది. నిందితుడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్ ఐలు కిరణ్, గీత, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ రఘు చందర్, పోలీసు అధికారులు ఉన్నారు.