ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 17 వేల మంది హాజరు కాలేదు

ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 17 వేల మంది హాజరు కాలేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజీ సబ్జెక్టు పరీక్షలు జరిగాయి. వీటికి రాష్ట్రవ్యాప్తంగా 5,14,184 మంది అటెండ్ కావాల్సి ఉండగా.. 4,96,899  మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 17,010 మంది గైర్హాజరు అయ్యారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఒక్కో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైందని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. 

ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా.. సుమారు గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి మొదలైంది. విద్యార్థులను తనిఖీలు చేసి, అధికారులు సెంటర్‌‌‌‌‌‌‌‌లోకి అనుమతించారు. సిద్దిపేట, పెద్దపల్లి, మహబూబ్‌‌‌‌నగర్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇంటర్ బోర్డు నుంచి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు టీమ్స్‌‌‌‌ను పంపించారు. హైదరాబాద్‌‌‌‌లోని పలు సెంటర్లలో విద్యార్థుల మీడియం మారడంతో ఓఎంఆర్ షీట్లు కొత్తవి అందించారు. 

దీంతో డీ–ఫారాల్లో మార్పుల కోసం పరీక్షా కేంద్రాల్లో సీఎస్‌‌‌‌లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, కొత్తగా పంపిస్తామని సూచించడంతో వెయిట్ చేశారు. కానీ చివరికి మధ్యాహ్నం 3 గంటలకు వారు చేతులెత్తేయ్యడంతో చేతితో రాసి అన్నింటినీ పోస్టాఫీసుల్లో అప్పగించారు. కాగా, హైదరాబాద్‌‌‌‌లోని పలు పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. జాహ్నవి, శ్రీచైతన్య, రత్నా జూనియర్ కాలేజీలకు వెళ్లారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వ హించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.