కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివ్నగర్జూనియర్కాలేజీలో ఇంటర్ఎగ్జామ్స్సందర్భంగా మాస్ కాపీయింగ్‌కు సహకరించారని ఇద్దరు లెక్చరర్లతో పాటు, ఎగ్జామ్సెంటర్చీఫ్సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ఆఫీసర్ లను సస్పెండ్‌చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సదాశివ్నగర్జూనియర్కాలేజీలో ఇంటర్సెకండ్ఇయర్పరీక్షల సందర్భంగా సెంటర్బయట బ్యాగుతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించాడు. వారిని చూసిన వెంటనే బ్యాగ్వదిలి పారిపోబోగా పట్టుకున్నారు.
అతడిని పట్టుకుని ఎంక్వైరీ చేయగా తన పేరు ఎండీ ఇష్రత్అని కాలేజీలో హిందీ లెక్చరర్‌నని చెప్పాడు. బ్యాగులో చెక్‌చేయగా హిందీ ఎగ్జామ్‌కు సంబంధించిన చిట్టీలు కనిపించాయి. చిట్టీలను సెంటర్లో ఉన్న లెక్చరర్రంజిత్కు ఇచ్చేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో లెక్చరర్లు ఇశ్రత్, రంజిత్‌పై మాల్ప్రాక్టీస్కింద కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన ఇంటర్‌బోర్డు లెక్చరర్లు ఇశ్రత్, బి.రంజిత్‌తో పాటు ఎగ్జామినేషన్సెంటర్చీఫ్సూపరింటెండెంట్ప్రతాప్లింగం, డిపార్ట్మెంట్ఆఫీసర్రాజాగౌడ్లను సస్పెండ్ చేశారు. సెంటర్లో కాపీయింగ్జరగలేదని ఇంటర్మీడియట్కామారెడ్డి జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్‌సలాం తెలిపారు.