ఖమ్మంలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో భవనంపై నుంచి కిందపడ్డాడు ఓ విద్యార్థి. సోమవారం ( సెప్టెంబర్ 23, 2024 ) జరిగిన ఈ ప్రమాదంలో లోకేశ్ అనే విద్యార్థి కాలు విరిగింది. వెంటనే అతడిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు కాలేజీ సిబ్బంది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లోకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం దుంపుల తిరుమలరిగా గుర్తించారు. ఎస్ఆర్ కళాశాల ముందు విద్యార్థి లోకేశ్ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. అసలు లోకేష్ భవనంపై నుంచి ఎలా కింద పడ్డాడో...తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. కళాశాల యాజమాన్యం మొదట లోకేష్ కు సల్వ గాయాలయ్యాయని సమాచారం ఇవ్వటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా... కాలేజీలో తరుచూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపణలలు ఉండటం గమనార్హం.