హైదరాబాద్లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ జామై ఉస్మానియా రైల్వే పాట్టాలపై మైనర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ సీఈసీ (CEC) చదవుతున్న భార్గవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తల, మొండెం విడిపోయి ఉన్న  మైనర్ బాలిక భార్గవి మృతదేహం చూసి విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. 

సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి ఆంధ్ర మహిళా సభ హాస్టల్ లో ఉండి.. అదే కాలేజీలో ఇంటర్ సీఈసీ చదువుకుంటున్నది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.