
కాజీపేట, వెలుగు: కాజీపేటలో మూడు రోజులపాటు జరిగిన ఇంటర్ ఎన్ఐటీల వాలీబాల్, హ్యాండ్ బాల్, యోగా టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది. కార్యక్రమానికి వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి క్రమశిక్షణకు, బలమైన జట్టు భావనకు దోహదం చేస్తాయని తెలిపారు. క్రీడలను విజయవంతంగానిర్వహించిన నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డీ శ్రీనివాసాచార్య, సెంటర్ ఫర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ హెడ్ రవికుమార్ ను ఆయన అభినందించారు.