
ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఫస్టియర్ లో 59.8 శాతం.. సెకండియర్ లో 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి ఇంటర్ ఫలితాలను హైదరాబాద్ లో విడుదల చేశారు.
76శాతంతో మేడ్చల్ జిల్లా అగ్రస్థానం సాధించింది. రంగారెడ్డి జిల్లా 71 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మెదక్ జిల్లా కేవలం 29శాతం ఇంటర్ రిజల్ట్ సాధించి ఆఖర్లో నిలిచింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను సుమారు 4.52 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4.90లక్షల మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారని జనార్ధన్ రెడ్డి చెప్పారు. సప్లిమెంటరీ షెడ్యూల్ ను రేపు విడుదల చేస్తామని చెప్పారు.