22న ఇంటర్ ఫలితాలు .. ఫస్ట్, సెకండ్​ ఇయర్ రిజల్ట్స్​ ఒకేసారి

22న ఇంటర్ ఫలితాలు .. ఫస్ట్, సెకండ్​ ఇయర్ రిజల్ట్స్​ ఒకేసారి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 22న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఫస్టియర్ తోపాటు సెకండియర్  రిజల్ట్స్​ను ఒకేసారి ప్రకటించనున్నారు. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డులో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిలీజ్ చేయనున్నారు. 

మంగళవారం ఇంటర్ బోర్డు ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్రంలో జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.96 లక్షల మంది అటెండ్ అయ్యారు. ఈ నెల రెండో వారంలో వాల్యుయేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది.