అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

జనగామ జిల్లా: గంజాయి, మత్తు మందు రవాణా.. వినియోగం పట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా..స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పోలీసుల కళ్లు కప్పి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. అయితే జఫర్గాడ్ మండలం నల్లబండ సమీపంలో తనిఖీలు చేస్తుండగా..రెండు కార్లలో ఉన్న వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. 

కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేయగా  భారీగా గంజాయి పట్టుపడింది. కార్లలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గా తేలింది. ఈ ముఠాలోని మరో ఇద్దరు సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టుపడిన నిందితుల వద్ద నుంచి 100 కేజీల ఎండు గంజాయి, 10లక్షల రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారు ఉపయోగించిన 2 కార్లను సీజ్ చేశారు.