నారాయణ కాలేజీలో మూడో అంతస్థు నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య

నారాయణ కాలేజీలో మూడో అంతస్థు నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది..జిల్లాలోని సోములదొడ్డి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ( జనవరి 23, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. చరణ్ అనే విద్యార్ధి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. క్లాస్ జరుగుతూ ఉండగానే బయటకు వెళ్లిన చరణ్ మూడో అంతస్థు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ చరణ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు సమాచారం. చరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. 

ALSO READ | తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు : భయంతో పరుగులు తీసిన భక్తులు