
మేడ్చల్ జిల్లా కీసర శ్రద్దా కళాశాలలో అపశృతి చోటు చేసుకుంది. ఇంటర్రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించి సిబ్బంది.. వెంటనే దగ్గరలో ఉన్న నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే రెండో సంవత్సరం ఎకనామిక్స్ ఎగ్జామ్ రాస్తున్న ప్రవల్లికకు ఫిట్స్రావడంతో కింద పడిపడిపోయింది. పరీక్ష మొదలైన కొద్దిసేపటికే మళ్లీ రెండు మూడు సార్లు ఫిట్స్ వచ్చాయి. దీంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఎదురుగా ఉన్న అద్విత్ ప్రయివేట్ హాస్పటిల్ కి తీసుకెళ్లిన ప్రవళికకు ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించారు. అనంతరం 108 లో నాచారం లోని ఈ ఎస్ ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ప్రవల్లిక ఆరోగ్యం నిలకడగా ఉంది.ప్రవల్లిక బాలాజీ నగర్ వాసి శ్రీ వైష్ణవి కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పరీక్షలు .. కీసర శ్రద్ధ కళాశాలలో ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుంది.