హాస్టల్ గదిలోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థి

హాస్టల్ గదిలోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థి

ఖమ్మం జిల్లా  మధిర మండలం కృష్ణాపురంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సీ గురుకుల రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి  సాయి వర్ధన్ (16)ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుండు.  హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు విద్యార్థి. 

ముదిగొండ కు చెందిన విద్యార్థి సాయి వర్ధన్  డిసెంబర్ 30న  తన  స్వగ్రామం ముదిగొండ నుండి హాస్టల్ కు వచ్చాడు.  హాస్టల్ లోనే  అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకి పాల్పడటంతో  పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.