Kadapa: పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి

Kadapa:  పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి

కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.  అక్టోబర్ 19న విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో బాధితురాలికి 80 శాతం కాలిన గాయాలయ్యాయి.  కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. 

నిందితుడు విఘ్నేశ్.. ప్రేమ పేరుతో బాలికను నాలుగేండ్లుగా వేధిస్తున్నాడు. అతనికి పెండ్లయినా వేధింపులు ఆపలేదు. శనివారం బాలిక ఎప్పట్లాగే కాలేజీకి వెళ్లింది. విఘ్నేశ్  ఆమెకు ఫోన్  చేసి కలుద్దామని చెప్పాడు. తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో బాలిక కాలేజీ నుంచి ఆటోలో అతను చెప్పి న చోటికి వెళ్లింది. బద్వేలు పాలిటెక్నిక్  కాలేజీ వద్ద విఘ్నేశ్  కూడా ఆటో ఎక్కారు. ఇద్దరూ బద్వేలు దాటి ఆటో దిగారు. 

విఘ్నేశ్.. బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. ఏమైందో ఏమో ఆమెపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. బాలిక అరవడంతో సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు వచ్చి మంటలు ఆర్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయింది.  బాధితురాలి వాంగ్మూలాన్ని జిల్లా జడ్జి తీసుకున్నారు.  నిందితుడు విఘ్నేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.