
హైదరాబాద్ లో యువత కొత్త తరహా డ్రగ్స్ వాడుతున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండానే ప్రమాదకరమైన మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ బాలాపూర్ మత్తు కోసం ముగ్గురు విద్యార్థులు మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. మత్తు మోతాదుకు మించడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.
మత్తు కోసం ముగ్గురు విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ ను విక్రయించాడు సాహిల్ . ఇంజక్షన్ తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకున్నారు ముగ్గురు విద్యార్థులు. అందులో ఇంటర్మీడియట్ విద్యార్థి అబ్దుల్ నసర్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సాహిల్అనుమతులు లేకుండా మత్తు ఇంజక్షన్లు టాబ్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read:-పట్టపగలే షిప్ట్ కారులో వచ్చి.. కత్తులతో బెదిరించి 6 తులాల బంగారం చోరీ
కొందరు యువకులు మత్తు టాబ్లెట్లను, ఇంజక్షన్లను సొంతంగా వినియోగించడమే కాకుండా ఇతరులకు కూడా అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని, వాటిని వాడేవారిపైనా.. అమ్మే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్‌కు సంబంధించి సమాచారాన్ని సమీప పోలీస్‌స్టేషన్‌కు గానీ, డయల్100 కు గానీ తెలియజేయాలని కోరారు