కామారెడ్డి, వెలుగు: డెంగ్యూతో స్టూడెంట్చనిపోయిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. టెకిర్యాల్కు చెందిన చౌకి సుజిత్ (16) స్థానికంగా ఇంటర్ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి10 రోజుల కిందట జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. టెస్ట్ లు చేయగా డెంగ్యూగా నిర్ధారణ అయింది. ఎంతకూ జర్వం తగ్గకపోగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ సుజిత్ ఆదివారం చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జ్వరాల బారిన పడి ఇప్పటికే జిల్లాలో ఐదుగురు చనిపోయారు.
పెద్దపల్లి జిల్లాలో మహిళ..
ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన మామిడి శ్రీలత(40) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆమెను భర్త శ్రీనివాస్ ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా.. తగ్గడంలేదు. అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా అక్కడ కూడా నయం కాలేదు. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. డాక్టర్లు పరీక్షలు చేసి డెంగ్యూగా నిర్ధారించారు. ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.