
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది.. జిల్లాలోని కోరుట్ల మండలం చిన్న మెట్ పల్లి గ్రామానికి చెందిన సంజయ్ అనే ఇంటర్ విద్యార్ధి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ( ఫిబ్రవరి 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గతంలో ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయిన సంజయ్.. రెండోసారి కూడా ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రులు గుడికి వెళ్లిన సమయంలో సంజయ్ ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహాశివరాత్రి కావడంతో పరమశివుడిని వేసుకునేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికొచ్చి చుస్తే కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం చుసిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. సంజయ్ మరణంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.