తండ్రి తెచ్చిన డ్రెస్ బాగోలేదని... ఉరేసుకుని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

తండ్రి తెచ్చిన డ్రెస్ బాగోలేదని...  ఉరేసుకుని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

దుండిగల్, వెలుగు:  కొత్త బట్టలు బాగోలేవని మనస్తాపంతో ఇంటర్ స్టూడెంట్ హాస్టల్ లో సూసైడ్ చేసుకున్నాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటుకపల్లికి చెందిన పుట్టి వెంకటేశ్, వినోద దంపతుల కొడుకు నిఖిల్(16) దుండిగల్ లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 

 గురువారం కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఉండగా.. తండ్రి కొత్త డ్రెస్ తెచ్చి ఇచ్చి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం డ్రెస్ బాగోలేదని నిఖిల్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. వేరే డ్రెస్ వేసుకోమని కోపంతో చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన నిఖిల్ శుక్రవారం తెల్లవారుజామున 3  గంటల ప్రాంతంలో హాస్టల్ లోని తన రూమ్ లో  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దుండిగల్ పోలీసులు తెలిపారు .