హన్మకొండ జిల్లా లో విషాదం నెలకొంది. కమలాపూర్ గ్రామానికి చెందిన భవానీ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి జిల్లా కేంద్రంలోని వైబ్రేట్ అకాడమీ స్టూడెంట్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థిని హాస్పిటల్ కు తరలించగా.. చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.
విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ దగ్గరకు చేరుకుని ఆందోళన చేశారు. తమ కూతురు మృతికి కారణం చెప్పాలంటూ ధర్నా చేశారు. కాలేజీలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.