- తెలిసిన వ్యక్తితో మాట్లాడుతుండగా బెదిరించి తీసుకెళ్లిన నిందితుడు
- ప్రైవేట్ వెంచర్లో అత్యాచారం
- నిందితుడి వేటలో జగదేవ్ పూర్ పోలీసులు
సిద్దిపేట/ జగదేవపూర్, వెలుగు: ఓ ఇంటర్ స్టూడెంట్ తెలిసిన వ్యక్తితో కలసి ఏకాంతంగా మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఎత్తుకెళ్లి జగదేవ్ పూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల కింద సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ స్టూడెంట్ కాలేజీ టైం అయిపోయిన ఇంటికి వెళ్తూ.. తెలిసిన వ్యక్తితో కలిసి బైక్పై జగదేవపూర్ వద్దకు చేరుకుంది.
నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా అదే టైంలో అక్కడ మద్యం తాగుతున్న గుర్తు తెలియని వ్యక్తి యువకున్ని బెదిరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తి స్టూడెంట్ను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి దగ్గరలోని ఒక ప్రైవేటు వెంచర్ లో అత్యాచారానికి పాల్పడి రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలు జగదేవ్ పూర్ పోలీసులను ఆశ్రయించింది.
నిందితుడి ఆచూకీ కోసం అత్యాచారం జరిగిన పరిసరాల్లో సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలిస్తుండగా నిందితుడు వాడిన బైక్ గుర్తించారు. ఈ విషయంపై గజ్వేల్ రూరల్ సీఐ జానకీరాంరెడ్డిని వివరణ కోరగా అత్యాచార ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసింది వాస్తవమేనని తెలిపారు. నిందితుడి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.